బీఆర్ఎస్సే కాంగ్రెస్.. కాంగ్రెస్సే బీఆర్ఎస్: MLA రాజయ్య సంచలన వ్యాఖ్యలు (వీడియో)
స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
దిశ, వరంగల్ బ్యూరో: స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్సే కాంగ్రెస్, కాంగ్రెస్సే బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యనించడంతో పార్టీ శ్రేణులు ఖంగుతిన్నాయి. రెండు పార్టీల ఒక్కటేనన్నంటూగా మాట్లాడటంతో కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ వైభవాన్ని గొప్పగా చెప్పే క్రమంలో ఎమ్మెల్యే ఈ పక్కా చూసిన బీఆర్ఎస్సే.. ఆ పక్కా చూసిన బీఆర్ఎస్సే.. ముందు చూసిన బీఆర్ఎస్.. వెనక్కి చూసిన్ బీఆర్ఎస్సే.. కాంగ్రెస్సే బీఆర్ఎస్.. బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అంటూ గందరగోళంగా మాట్లాడారు. దీంతో ఆత్మీయ సమావేశంలో కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలు అర్థం కాక తలలు పట్టుకోవడం గమనార్హం.