బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi)కి హైకోర్టు(High Court) లో ఊరట దక్కింది.
దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Lakshmi)కి హైకోర్టు(High Court) లో ఊరట దక్కింది. కోవా లక్ష్మి ఎన్నిక చెల్లదని ఆసిఫాబాద్ కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యామ్(Ajmera Shyam) దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ లో కోవా లక్ష్మి తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో అజ్మీర శ్యామ్ పిటిషన్ వేశారు. కోవా లక్ష్మి ఆ ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ లో ఆరోపించారు. ఇరువర్గాల వాదన విన్న హైకోర్టు అజ్మీర శ్యామ్ పిటిషన్ ని కొట్టివేసింది. కోవా లక్ష్మీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 22,798ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మేర శ్యామ్ నాయక్ పై విజయం సాధించారు. లక్ష్మికి 83036 ఓట్లు, అజ్మీరాకు 60,238 ఓట్లు పోలయ్యాయి.
కోవా లక్ష్మీ 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపై 19055 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జైనూర్ జెడ్పీటీసీ స్థానం నుండి ఏకగ్రీవంగా ఎన్నికై, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ గా పనిచేశారు.