కోమటిరెడ్డి తాత దిగొచ్చినా అది సాధ్యం కాదు.. జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.

Update: 2024-01-22 09:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంకా వాళ్లు ప్రతిపక్షంలో ఉన్నామనే అనుకుంటున్నారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగే.. అసహనానికి గురవుతున్నారని ఎద్దేవా చేశారు. విపక్ష నేతల మీదున్న కోపంతో రాష్ట్ర భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేయొద్దని అన్నారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. నిమిషానికే మాట మార్చే రకం కోమటిరెడ్డి అని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డిని కాంగ్రెస్‌లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారని గుర్తుచేశారు. కాంగ్రెస్‌లో ఉంటూ మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి ఓటేయాలని చెప్పినది ఎవరూ మర్చిపోలేదని అన్నారు. ఇప్పుడేమో బీఆర్ఎస్‌ను 39 ముక్కలు చేస్తా అని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ను చీల్చడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాత తరం కూడా కాదని అన్నారు. కోమటిరెడ్డి లాంటి వారిని అనేకమందిని బీఆర్ఎస్ చూసిందని తెలిపారు.

Tags:    

Similar News