ఎన్నికలకు ముందే కాంగ్రెస్, బీజేపీ చతికిలబడ్డాయి.. జగదీష్ రెడ్డి సెటైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-04 12:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ సంస్కృతి కాంగ్రెస్‌దే అన్నారు. ట్యాపింగ్ చేయాల్సిన అవసరం బీఆర్ఎస్‌కు లేదని తెలిపారు. ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం చేతకాక, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎత్తుకున్నారని విమర్శించారు. ఎంతో హడావుడి చేసిన కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలకు ముందే చతికిలబడ్డాయని సెటైర్ వేశారు. కాంగ్రెస్‌, బీజేపీల్లో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ నేతలను చేర్చుకొని బరిలోకి దింపుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ లేని లోటును 100 రోజుల్లోనే ప్రజలు గుర్తించారని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News