మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయాలి..బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా గ్రూప్స్ ప్రిలిమ్స్‌కు 1:100మందిని పిలువాలని నాడు డిమాండ్ చేసి నేడు మాట తప్పినందుకు వెంటనే రాజీనామా చేయాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2024-07-08 15:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా గ్రూప్స్ ప్రిలిమ్స్‌కు 1:100మందిని పిలువాలని నాడు డిమాండ్ చేసి నేడు మాట తప్పినందుకు వెంటనే రాజీనామా చేయాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్‌లు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బక్క జడ్సన్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సోమవారం నాటికి 7వ రోజుకు చేరింది. ఆయనకు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, ఎర్రోళ్ల శ్రీనివాస్, గెల్లు శ్రీనివాస్, వాసుదేవ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం గ్రూప్స్ ప్రిలిమ్స్‌కు 1:100 పిలుస్తామని పెట్టారని, దాని ప్రకారం కాకుండా 1:50 అని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమేనన్నారు. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టులు పెంచుతామని, 25వేలతో మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించి మాట తప్పారని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తామని ఇచ్చిన హామీని విస్మరించారన్నారు. దీక్షతో జడ్సన్ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణించి పోతుందని, ఆయనకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. నిరుద్యోగుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తుంగబాలు, శివ తదితరులు పాల్గొన్నారు.


Similar News