BRS: ఖబర్దార్ రేవంత్.. తిరుగుబాటు తప్పక వస్తుంది.. కేటీఆర్ హెచ్చరిక

ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు.

Update: 2024-11-21 08:12 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇది ప్రజాపాలన ఎలా అవుతుంది రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) ప్రశ్నించారు. మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా మానుకోట(Manukota)లో 144 సెక్షన్ అమలులో ఉండటంతో పోలీసులు కవాతు(March Fast) నిర్వహించారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన కేటీఆర్.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. దీనిపై ఇప్పుడు అక్కడ ఎన్నికలు లేవు.. మరి ఈ పోలీసుల లాంగ్ మార్చ్(Police Long March) ఏంటని, అక్కడ గొడవలు ఏం జరగలేదు.. మరి పోలీసుల హెచ్చరికలు ఎందుకని నిలదీశారు.

అలాగే అసలు మహబూబాబాద్ జిల్లా మానుకోటలో ఏం జరుగుతుందని, శాంతియుతంగా సభ నిర్వహించుకుంటామంటే అవకాశం కూడా ఇవ్వని దుస్థితి ఎందుకు వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన(People Governence) ఎలా అవుతుందని, ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన(Rule Of Restriction), నిరంకుశ పాలనAautocratic Rule), కంచెల పాలన(Fence Rule), కక్ష్యల పాలన(Orbit Rule), ఆంక్షల పాలన(Sanctions Rule) అంటూ.. మొత్తంగా రాక్షస పాలన(Monster Rule) అవుతుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. అంతేగాక ఖబర్దార్ రేవంత్.. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుందని మాజీమంత్రి హెచ్చరించారు. 

Tags:    

Similar News