Beerla Ailaiah : గురుకులాల సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

గురుకుల పాఠశాలGurukul schoolsల్లో కుట్ర పూరితంగా సమస్యలు సృష్టించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy government)పై బీఆర్ఎస్(BRS)పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్(Beerla Ailaiah)ఆరోపించారు

Update: 2024-11-30 11:14 GMT
Beerla Ailaiah : గురుకులాల సమస్యలతో రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ దుష్ప్రచారం : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
  • whatsapp icon

దిశ, వెడ్ డెస్క్ : గురుకుల పాఠశాలGurukul schoolsల్లో కుట్ర పూరితంగా సమస్యలు సృష్టించి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం(CM Revanth Reddy government)పై బీఆర్ఎస్(BRS)పార్టీ దుష్ప్రచారం చేస్తుందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య యాదవ్(Beerla Ailaiah)ఆరోపించారు. అయిలయ్య మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన పైన పింక్ మీడియాతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గురుకులాలపైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar)పెద్ద కుట్రకు పాల్పడుతున్నాడని, గురుకులాల సెక్రటరీగా ఉన్నప్పుడు నియమించుకున్న తన మనుషులతో ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నాడని ఆరోపించారు.

పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని, మా ముఖ్యమంత్రి 40 శాతం డైట్ చార్జీలు పెంచి మంచి భోజనం అందిస్తుంటే ఓర్వ లేక ఫుడ్ పాయిజన్ అంటు కుట్రలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ కు తొత్తుగా వ్యహరిస్తున్న ప్రవీణ్ కుమార్ కుట్రలను సాగనివ్వబోమన్నారు. సోషల్ మీడియాలో ఎంత దుష్పచారం చేసినా ప్రజలకు నిజాలు తెలుసని, 10ఏళ్ల పాటు అధికారంలో ఉండి కనీసం డైట్ ఛార్జ్ లు పెంచలేదని, తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతలు మారడటం లేదని విమర్శించారు. 

Tags:    

Similar News