BRS: ఆ రోజు లేకపోతే ఈ రోజు లేనే లేదు.. మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్(KTR) తెలిపారు.

Update: 2024-12-09 04:11 GMT

దిశ, వెబ్ డెస్క్: మహోజ్వల ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజు అని, స్వరాష్ట్ర కల సాకారానికి పునాది వేసిన రోజు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్(KTR) తెలిపారు. కేసీఆర్(KCR) నిరాహార దీక్షతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ రోజుని బీఆర్ఎస్ పార్టీ(BRS Party) దీక్షా విజయ్ దివస్(Deeksha Vijay Divas) గా జరుపుతోంది. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు(Wishes) తెలియజేశారు. "కేసిఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.." అని చావునోట్లో తలపెట్టిన సంకల్పానికి.. దేశ రాజకీయ వ్యవస్థ దిగివచ్చిన రోజు అని అన్నారు. అలాగే తెలంగాణ చరిత్రలో.. “నవంబర్ 29” లేకపోతే.. “డిసెంబర్ 9” ప్రకటన లేదని, ఈ కీలక మలుపు లేకపోతే.. “జూన్ 2” గెలుపు లేనే లేదని చెప్పారు. దగాపడ్డ నేల విముక్తి కోసం.. ఉద్యమ సారథే ప్రాణత్యాగానికి సిద్ధమై.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరిపోసిన.. “దీక్షా విజయ్ దివస్” సందర్భంగా.. యావత్ తెలంగాణ ప్రజలకు.. లక్షలాది గులాబీ సైనికులందరికీ.. హృదయపూర్వక శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News