అదానీ గ్రూప్‌నకు పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల బాధ్యత.. CM Revanth, Rahul Gandhiపై BRS ఫైర్

హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు అప్పగించడం ఏంటనీ బీఆర్ఎస్ మండిపడింది.

Update: 2024-06-29 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ పాతబస్తీలో కరెంటు బిల్లుల వసూళ్ల బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం అదానీ గ్రూప్‌నకు అప్పగించడం ఏంటనీ బీఆర్ఎస్ మండిపడింది. ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ప్రెస్‌మీట్‌‌కు సంబధించిన వార్త క్లిప్‌ను షేర్ చేసింది. మీడియా ప్రతినిధుల చిట్ చాట్‌లో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పాతబస్తీలో కరెంట్ బిల్లుల బకాయిల బాధ్యతలను పైలెట్ ప్రాజెక్ట్ కింద అదానీ గ్రూప్‌నకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. పాతబస్తీలో కరెంట్ బిల్లులను సరిగా చెల్లింకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ ప్రకటించారు. పాతబస్తీలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టిన అనంతరం హైదరాబాద్ వ్యాప్తంగా.. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ బిల్లుల వసూళ్ల బాధ్యతలు అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టనున్నట్లు తెలిపారు. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ పార్టీ ట్విట్టర్ వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడింది. కాంగ్రెస్ కపటత్వం బయటపడిందని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలోని కరెంట్ బిల్లు కలెక్షన్ బాధ్యతలను అదానీకి అప్పగించి 25 శాతం డబ్బులను ఆయన జేబులోకి వెళ్లే పగటి పూట దోపిడీకి తెర లేపారని సీరియస్ అయింది. రాహుల్ గాంధీ చెప్పే యాంటీ అదానీ మాటలు సిగ్గుచేటు అని చురకలు అంటించింది. ప్రజల యుటిలిటీస్‌ని కార్పొరేట్లకు అమ్మడమే కాంగ్రెస్ వైఖరి అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

Similar News