కేసీఆర్ రెడీ.. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి రేపు అక్కడకు!

సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడానికి సిద్ధమయ్యారు.

Update: 2024-02-05 07:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్‌కు రావడానికి సిద్ధమయ్యారు. మంగళవారం బీఆర్ఎస్‌ ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌ వేదికగా సమావేశం కానున్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత ఆయన తెలంగాణ భవన్‌కు రానుండటం ఇదే తొలిసారి కానుంది. పార్లమెంట్ ఎన్నికల సన్నాహకాలపై నేతలతో ఆయన చర్చించనున్నారు. ఎన్నికల్లో తీసుకోబోయే వ్యూహాలు, ప్రజాక్షేత్రంలో తప్పక చెప్పాల్సిన విషయాలు, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై సొంత నేతలకు గులాబీ బాస్ దిశా నిర్దేశం చేయనున్నారు.

కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేసిన కేసీఆర్.. కామారెడ్డిలో ఓటమి పాలు కాగా.. గజ్వేల్‌లో గెలుపొందారు. ఎన్నికల అనంతరం ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 13న నల్లగొండ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ నుంచి పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు.

Tags:    

Similar News