BREAKING: ఘనంగా వసంత పంచమి వేడుకలు.. భక్తులతో కిటకిటలాడుతున్న బాసర సరస్వతి ఆలయం

వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటలాడుతున్నాయి.

Update: 2024-02-14 02:45 GMT

దిశ, భైంసా: వసంత పంచమి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు కిటలాడుతున్నాయి. ముఖ్యంగా సరస్వతి మాత ఆలయాల్లో అక్షరాభ్యాస కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా బాసర ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు అమ్మవారి ప్రత్యేక పూజలతో ఇవాళ తెల్లవారుజాము నుంచే ప్రారంభమయ్యాయి. చదువుల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు జరిపించడానికి వేలాదిగా తరలి వచ్చారు.

ఇందు కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా క్యూలైన్లు, అక్షరాభ్యాస టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున రెండు గంటలకు అమ్మవారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మూడు గంటల నుంచి అక్షర శ్రీకార పూజలను అర్చకులు ప్రారంభించారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాసర సరస్వతీ ఆలయాన్ని విద్యుత్‌ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. ఆలయ గోపురాలు, తదితర ప్రాంతాల్లోనూ విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. అయితే, అక్షరాభ్యస క్రతువుకు సుమారు 6 గంటల సమయం, అమ్మవారి దర్శనం కోసం 3 గంటల సమయం పడుతోంది.   

Read More..

BREAKING: మేడారం మహా జాతరలో ప్రత్యేక పూజలు ప్రారంభం.. తరలివస్తున్న భక్తజన సందోహం

Tags:    

Similar News