BREAKING: పంజా విసిరిన డ్రగ్ కంట్రోల్ బ్యూరో.. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకుల్లో విస్తృతంగా తనిఖీలు
నగరంలో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మికంగా సోదాలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు బ్లడ్ బ్యాంకుల్లోనూ తనిఖీలు చేపట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: నగరంలో డ్రగ్ కంట్రోల్ బ్యూరో ఆకస్మికంగా సోదాలు చేపట్టింది. ఈ మేరకు అధికారులు బ్లడ్ బ్యాంకుల్లోనూ తనిఖీలు చేపట్టారు. నగరంలో దిల్‌సుఖ్ నగర్, మలక్‌పేట్, చైతన్యపురి, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, మెహదీపట్నం, మల్కాజ్‌గిరిలో ఉన్న 9 బ్లడ్ బ్యాంకుల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. ఈ మేరకు కొన్ని బ్లడ్ బ్యాంకుల్లో నాసిరకం వస్తువులను వాడుతున్నట్లుగా గుర్తించారు. రక్తాన్ని సేకరించే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంతో కారణంగా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవడం లేదని గమనించారు. ఈ మేరకు పలు బ్లడ్ బ్యాంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.