BREAKING: రాహుల్ గాంధీ ప్రధాని ఎన్నటికీ కాలేడు: కేంద్ర మంత్రి పియూష్ గోయల్

రాహుల్ గాంధీ ఇక ఎన్నటికీ ప్రధాన మంత్రి కాలేడని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు.

Update: 2024-04-22 10:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ ఇక ఎన్నటికీ ప్రధాన మంత్రి కాలేడని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. ఇవాళ ఆయన బీజేపీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొన్నారు. ముందుగా చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేయగా.. సోమవారం ఉదయం 11.15 గంటలకు రాజేంద్రనగర్‌లోని తహసీల్దార్ ఆఫీసులో రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. ఆయనతో పాటు కార్యక్రమంలో ఎంపీ, జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కె.లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

అదేవిధంగా సంగారెడ్డిలో జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ నామినేషన్ కార్యక్రమంలో కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పియూష్ గోయల్ మాట్లాడుతూ.. పేదల అభ్యున్నత గురించి పాటుపడేది కేవలం బీజేపీయే అని అన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో ఎంతో వెనక్కి వెళ్లిందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో భారీ ఎత్తున కుంభకోణాలు జరిగాయని, అవన్ని వెలికి తీస్తే.. ఆ పార్టీ గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ నిర్వీర్యమైందని ఆరోపించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం పక్కా అని పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. 

Read More..

కోమటిరెడ్డిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనక రహస్యమిదే: ఏలేటి మహేశ్వర్ రెడ్డి 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..