BREAKING: కామారెడ్డి జిల్లా ఘన్‌పూర్ వద్ద పోలీసుల తనిఖీలు.. రూ.49.08 లక్షల నగదు సీజ్
లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణమే దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు సరిహద్దులతో పాటు ప్రధాన చెక్‌పోస్టుల వద్ద విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. నేతలు ఓటర్లను డబ్బు, మద్యం, ఇతర వుస్తువలతో ప్రలోభాలకు గురి చేయకుండా రాత్రింబవళ్లు రోడ్లపై పకడ్బందీగా పహారా కాస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కామారెడ్డి జిల్లా పరిధిలోని ఘన్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేపడుతుండగా.. కారులో తరలిస్తున్న రూ.49.08 లక్షలను గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో క్యాష్‌ను సీజ్ చేసి ఫ్లయింగ్ స్క్వాడ్‌కు అప్పగించారు.