BREAKING: ఏపీలో కూటమికి షాకిచ్చిన స్వామి పరిపూర్ణానంద.. స్వతంత్ర అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలోకి
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో కూటమికి బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో కూటమికి బిగ్ షాక్ తగిలింది. హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఇవాళ స్వామి పరిపూర్ణానంద నామినేషన్ దాఖలు చేశారు. అయితే, పరిపూర్ణానంద ముందు హిందూపురం లోక్‌సభ లేదా అసెంబ్లీ స్థానాల నుంచి అభ్యర్థిగా పోటీ చేయాలని అనుకున్నారు. అయితే, హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా అధిష్టానం ఖరారు చేసినప్పటికీ.. ఎక్కడ మైనారిటీ ఓట్లు బీజేపీ పడవనే అనుమానంతోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. పొత్తుల కారణంగానే తనకు టికెట్ రాకుండా చేశారంటూ పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, హిందూపూరం పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నేత బీకే పార్థసారథి పోటీ చేయబోతున్నారు. ఇక అసెంబ్లీకి చంద్రబాబు బావమరిది, సినీనటుడు బాలకృష్ణ మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో కూటమి ఓట్లు చీలుతాయనే భయం టీడీపీ వెంటాడుతోంది. ఈ విషయంలో చంద్రబాబు కలుగజేసుకుని పరిపూర్ణానందను నామినేషన్ ఉపసంహరించుకునేలా చేస్తారా.. లేక అలాగే విదిలేస్తారా వేచి చూడాల్సిందే.