BREAKING: బీఆర్ఎస్‌కు మరో షాక్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని కలిసిన మిట్టపల్లి సురేందర్
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలో నేతల జంపింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు మరో నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో రాష్ట్రంలో నేతల జంపింగ్స్ ఇప్పటికే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు సామాజిక, రాజకీయ అంశాలను ఆధారంగా చేసుకుని ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు సమాయత్తమవుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ రిజర్వ్ స్థానాల్లో టికెట్ల కేటాయింపు ఆయా పార్టీలకు సవాలుగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది.
అయితే, పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి ప్రముఖ ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకారుడు మిట్టపల్లి సురేందర్‌ను బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్టానం యోచించింది. చివరికి ఏం జరిగిందో తెలియదు.. ఆ స్థానంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేరును ఖరారు చేస్తూ.. గులాబీ బాస్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన మిట్టపల్లి సురేందర్ ఇవాళ బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు వెళ్లి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు తాను బీజేపీ తరఫున పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నానని తెలిపినట్లుగా సమాచారం.
బీజేపీ రాష్ట్ర ఆఫీసులో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలసిన మిట్టపల్లి సురేందర్
— Telugu Scribe (@TeluguScribe) March 5, 2024
పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ టికెట్ ఆశిస్తోన్న మిట్టపల్లి సురేందర్. pic.twitter.com/JXwLaLD2yp