BREAKING: కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మిగిలేది గాడిద గుడ్డే: రేవంత్‌పై బండి సంజయ్ సెటైర్లు
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. మిగిలేది గాడిద గుడ్డేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. మిగిలేది గాడిద గుడ్డేనని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్‌రెడ్డికి గాడిద గుడ్డుపై ఉన్న శ్రద్ధ హామీ ఇచ్చిన గ్యారెంటీలపై లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేసేంత వరకు వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని అన్నారు. మరోసారి మోడీ, అమిత్ షాపై మాట్లాడితే ఖబర్దార్ అని బండి సంజయ్ హెచ్చరించారు. ఫేక్ వీడియోలతో ప్రజలకు మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.