TSPSC Group 1 Prelims : బ్రేకింగ్ : గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు

తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి.

Update: 2023-09-23 05:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ గ్రూప్ -1 పరీక్షలు మళ్లీ రద్దు అయ్యాయి. జూన్ 11న జరిగిన గ్రూప్ -1 పరీక్షలను హై కోర్టు రద్దు చేసింది. బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేయకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీటు ఇవ్వడంపై తెలంగాణ హైకోర్టును గ్రూప్-1 అభ్యర్థులు ఆశ్రయించారు. ఇక, గ్రూప్ -1 పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన హైకోర్టు పరీక్షలు మళ్లీ నిర్వహించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. గతంలో పేపర్ లీకేజీ కారణంగా గ్రూప్ -1 పరీక్ష రద్దు కాగా తాజాగా హైకోర్టు ఆదేశాలతో రెండోసారి రద్దయింది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను 2,33,248 మంది రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించారు. లీకేజీ వ్యవహారం కారణంగా పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఈ పరీక్షను నిర్వహించారు. దీంతో పరీక్ష రాసిన అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..