Breaking : పంట నష్టపోయిన రైతులకు గుడ్ న్యూస్.. పరిహారం విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్, డబ్బు జమయ్యేది ఆ రోజే

అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి.

Update: 2024-05-05 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు అకాల వర్షానికి నేలపాలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాలో వడగండ్ల వానలు, ఈదురుగాలులు పంటలను అతలాకుతలం చేశాయి. ఈ నేపథ్యంలో రైతన్న వేదనను చూసిన ప్రభుత్వం.. వారికి పంట నష్ట పరిహారం ఇచ్చి ఆదుకుంటామని భరోసానిచ్చింది. సీఎం ఆదేశాల మేరకు మార్చి 16 నుంచి 24 వరకు దాదాపు 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో వివిధ పంటలను నష్టపోయినట్లుగా అధికారులు ఓ నివేదికను రూపొందించారు. మొత్తం రూ.15.81 కోట్లను రైతులకు పంట నష్ట పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని ఆర్ధిక శాఖ ఫండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. అయితే, ఈ లోపే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పరిహారం పంపిణీకి తాత్కలికంగా బ్రేక్ పడింది. అసలే సాగునీరు లేక కరువు తాండవిస్తుండటంతో రైతన్నను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. రైతులకు పంట నష్ట పరిహారం విడుదలకు ఇవాళ అనమతి కోరగా.. ఎన్నికల సంఘం అందుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో సోమవారం లేదా మంగళవారం వారి ఖాతాల్లో డబ్బు జమ కానుంది. 

Tags:    

Similar News