BREAKING: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా తెచ్చుకోండి.. బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి

కాంగ్రెస్ మాస్ లీడర్ మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు.

Update: 2024-04-11 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాస్ లీడర్ మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నల్లగొండలో మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు తెచ్చుకుని చూపించాలని చాలెంజ్ చేశారు. అలా చేస్తే తాను, నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఒడగొట్టినా బీఆర్ఎస్ పార్టీకి సిగ్గు రాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగా తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ హరీష్‌రావు డైలాగులు కొడుతున్నాడని, ఆ డైలాగులు ఇక బంద్ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..