BREAKING: నంద్యాల ఎస్పీకి షాకిచ్చిన ఈసీ.. శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది.

Update: 2024-05-12 10:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు అధికారులంతా తమ గుప్పిట్లోకి పెట్టుకుని ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు మందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కొరడా కొరడా ఝళిపిస్తోంది. ఇటీవల ఏకంగా డీజీపీపైనే సస్పెన్షన్ వేటు వేసింది. ఈ క్రమంలోనే తాజాగా.. నంద్యాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జన సమీకరణపై ఈసీ సీరియస్ అయింది. దీంతో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డిపై శాఖపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఎస్పీతో పాటు ఎస్‌డీపీవో రవీంద్రనాథ్ రెడ్డి, సీఐ రాజారెడ్డిపై రాత్ర 7 గంటల లోపు ఛార్జెస్ ఫైల్ చేయాలని సీఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది.    

Tags:    

Similar News

టైగర్స్ @ 42..