Dilip Konatham: దిలీప్‌ కొణతంను విడిచిపెట్టిన సైబర్ క్రైం పోలీసులు.. అలా చేయాలని నోటీసులు

తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం‌ను గురువారం సైబర క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-06 02:35 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ కొణతం‌ (Dilip Konatham)ను గురువారం సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఉదయం ఆయనను సైబర్ క్రైం పోలీసులు విడిచిపెట్టారు. అవసరం అయితే మళ్లీ విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా జారీ చేశారు. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), ప్రభుత్వంపై సోషల్ మీడియా (Social Media)లో విద్వేషాలను రెచ్చగొట్టేలా అనుచితంగా పోస్టులు పెట్టిన కారణంగా ఆయనను సైబర్ క్రైం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ప్రధాన అనుచరుడిగా, బీఆర్ఎస్ ఐటీ సెల్‌లో దిలీప్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కలువుదీరడంతో సర్కార్‌పై సోషల్ మీడియా వేదికగా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయనపై పలు కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర అధికారికి చిహ్నాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా ఆనపై కేసు నమోదైంది. దీంతో ఆయన అందుకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించే వరకు అరెస్ట్ చేయకూడదని హైకోర్ట్ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. 


Similar News