BREAKING : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. పొందుపర్చిన సంచలన హామీలివే..!
ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎంపీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోను శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసింది. మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ విడుదల చేశారు. న్యాయ్ పత్ర -2024 పేరుతో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను చేర్చారు. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీలు అంటూ మేనిఫెస్టోకు కాంగ్రెస్ పేరు పెట్టింది. 48 పేజీలలో కాంగ్రెస్ మేనిఫెస్టోను పొందుపర్చింది.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కీలక హామీలివే..!
దేశవ్యాప్తంగా 8 కోట్ల కాంగ్రెస్ గ్యారంటీ కార్డుల పంపిణీ
పెట్రోల్, డిజీల్ ధరల తగ్గింపు
వ్యవసాయ పరికరాలకు జీఎస్టీ మినహాయింపు
దేశవ్యాప్తంగా కుల గణన
కనీస మద్దతు ధరకు లీగల్ గ్యారంటీ
రైల్వే ప్రైవేటీకరణ నిలిపివేత
రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు
అగ్నివీర్ స్కీమ్ రద్దు
యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు
మహాలక్ష్మీ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఏడాదికి రూ.లక్ష నగదు సాయం
కులగణన తర్వాత రిజర్వేషన్ల పరిమితి పెంపునకు రాజ్యాంగ సవరణ
ఎలక్టోరల్ బాండ్స్ మీద ఎంక్వైరీ
కనీస మద్దతు ధర చట్టం
విద్యార్థులకు రూ.లక్ష ఆర్థిక సాయం
రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ
పెగాసెస్, రాఫెల్‌పై విచారణ