బ్రేకింగ్ : ఏపీ మాజీమంత్రి నారాయణ ఇళ్లు, ఆఫీస్‌లో సీఐడీ సోదాలు

మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో వరుసగా రెండో రోజు అంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

Update: 2023-02-25 04:50 GMT

దిశ, శేరిలింగంపల్లి : మాజీ మంత్రి నారాయణ కుమార్తె నివాసంలో వరుసగా రెండో రోజు అంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అమరావతిలో బినామీల పేర్లతో 146 ఎకరాల భూములు కొన్నారన్న ఆరోపణల నేపథ్యంలో నారాయణ కూతుర్లు సింధూర, శరణి ఇళ్లు, కార్యాలయల్లో ఏపీ సీఐడీ సోదాలు చేస్తుంది. అమరావతిలో భూమి కొనుగోలు విషయంలో కొందరు పేర్ల మీద బినామీ ఆస్తులు కూడగట్టారని ఏపీ సీఐడీ ప్రధానంగా ఆరోపిస్తున్నది.

అందులో భాగంగా సింధు, శరణి నుండి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. ఏపీ సిఐడి నారాయణ కూతుళ్లు నివసిస్తున్న ఇళ్లలో ఇతర అకౌంట్ డీటెయిల్స్ చెక్ చేస్తున్నారు. ముఖ్యంగా మాదాపూర్‌లో నారాయణ స్కూల్స్, కాలేజీలకు సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంది. అందులో కూడా రెండు ఏపీ సీఐడీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. కొండాపూర్‌లోని కొల్లా లక్జేరీ విల్లాస్‌లో నివాసముంటున్న నారాయణ కూతురు శరణి ఇంట్లో ఆరుగురు సీఐడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

Tags:    

Similar News