BREAKING: బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదు: మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాదని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-24 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్కటంటే ఒక్కసీటు కూడా రాదని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్‌పై ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మనగడే ప్రశ్నార్థకం అవుతోందని అన్నారు. పదేళ్లు సీఎంగా ఉన్న నాడు.. అకాల వర్షాలతో పంటలను కోల్పోయిన రైతులను పరమర్శించిన సందర్భం ఉందా అని ప్రశ్నించారు.

ఎన్నికలు రాగానే కొత్తగా దొరకు రైతులు గుర్తొచ్చి బస్సు యాత్రకు బయలుదేరాడంటూ ఎద్దేవా చేశారు. ఏ సర్వే చూసినా.. బీజేపీకి మాత్రమే ఎక్కవ సీట్లు వస్తాయంటూ రిపోర్టు వస్తున్నాయని తెలిపారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో సున్నా సీట్లు ఖాయమని, ఆ విషయం చెబితే ఇప్పుడు పార్టీలో ఉన్న కార్యకర్తలు మిగలరంటూ సెటైర్లు వేశారు. 14 ఏళ్ల తరువాల ఓ ఛానల్‌కు కేసీఆర్ వచ్చి మాట్లాడితే.. ప్రజలకు ఆయన మాటలను నమ్మే స్థితిలో లేరని రఘునందన్ స్పష్టం చేశారు.    

Tags:    

Similar News