BREAKING: ఇబ్రహీంపట్నంలో దారుణం.. సెల్ఫీ వీడియో తీసి, చెట్టుకు ఉరేసుకుని ఔట్ సోర్సింగ్ ఉద్యోగి బలవన్మరణం

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది.

Update: 2024-03-05 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. పట్ణణానికి జయంత్ అనే యువకుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో కొన్నాళ్ల నుంచి ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఇవాళ ఇబ్రహీంపట్నం శివారులో అతడు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు.

ఈ మేరకు జయంత్ ఆత్మహత్య చేసుకునే ముందు మొబైల్‌లో సెల్ఫీ వీడియోను రికార్డ్ చేశాడు. అందులో తన చావుకు కారణం ఇద్దరు వ్యక్తులని తెలిపాడు. ఆసుపత్రి సూపరింటెండెంట్ రంగనాథ్, ఇబ్రహీంపట్నం ఎస్సై మైబెల్లి తీవ్రంగా వేధించారంటూ జయంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ మానసిక వేదన తట్టుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృతుడు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.   

Tags:    

Similar News