BREAKING: తెలంగాణలో మరో సంచలన ఘటన.. మూడేళ్ల చిన్నారిపై యువకుడి లైంగిక దాడి

అత్యాచారాలతో రాష్ట్రంలో తీవ్ర అశాంతి నెలకొంది.

Update: 2024-07-02 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: అత్యాచారాలతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా తీవ్ర అశాంతి నెలకొంది. కొంతమంది కమాంధులు తమ లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అభం శుభం తెలియని మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడుతూ.. సభ్యసమజంలో చీడ పురుగుల్లా మారుతున్నారు. ఈ క్రమంలో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సిర్పూర్ మండలం వెంకట్రావ్ పేట గ్రామానికి చెందిని బుడే రాజేందర్(24) అనే యువకుడు, అదే గ్రామంలో ఆడుకుంటున్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్లాడు. అందులో ఓ మూడేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి అక్కడి నుంచి తన ఇంటికి తీసుకెళ్లాడు. అయితే, తొటి పిల్లలు చిన్నారిని రాజేందర్ తీసుకెళ్లాడని తల్లిదండ్రులకు చెప్పగా.. వారు అతడి ఇంటికి వెళ్లారు. అక్కడ చిన్నారి రక్తస్రావమై ఏడుస్తూ కనిపించేసరికి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. రాజేందర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అయితే, చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందింతుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు ఆందోళనకు దిగారు.

Similar News