న్యాయవాద వృత్తి సామాజిక ఇంజనీరింగ్.. బోయినపల్లి వినోద్ కుమార్

Update: 2023-03-02 16:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: న్యాయవాద వృత్తి సామాజిక ఇంజనీరింగ్ అని.. అట్టడుగు, అణగారిన వర్గాలకు న్యాయవాద వృత్తితోనే సామాజిక న్యాయం అందుతుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. హైదరాబాద్ చైతన్యపురిలోని మహిళా న్యాయ కళాశాలలో గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. లా విద్యార్థులు సామాజిక అంశాలపై పరిపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

రాజ్యాంగంలోని పీఠికకు అనుగుణంగా ముందుకు సాగాలని, పౌర హక్కులు, ఆదేశిక సూత్రాలను అనుసరించినప్పుడే న్యాయ వాద వృత్తిలో రాణిస్తారని అన్నారు. ఈ సదస్సులో హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ మహిళా లా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మానస, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పుష్పాంజలి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సొసైటీ ఓ.ఎస్.డీ. డాక్టర్ పావని, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News