మణికొండ లో దారుణం.. కారులో మృతదేహం కలకలం..

మారుతి కారులో ఓ వ్యక్తి మృత దేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.

Update: 2024-02-04 08:56 GMT

దిశ డైనమిక్ బ్యూరో: మారుతి కారులో ఓ వ్యక్తి మృత దేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా లోని మణికొండలో ఓ మారుతి కారులో మృతదేహం ఉండడం స్థానికులు గమనించారు. మృతదేహాన్ని చూసి భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు హుటాహుటీన ఘటనాస్థలానికి చేరుకున్నారు.

అనంతరం కారులో డ్రైవర్ వెనక సీట్లో మృతదేహం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మృత దేహాన్ని పరిశీలించారు. ఆ తరువాత ఆ మృతదేహం మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. ఇక మృతుడి వివరాల గురించి ఆరాతీసిన పోలీసులు నిన్న (శనివారం) రమేష్ తన స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లినట్లు కనుగొన్నారు. అయితే రమేష్ మృతి పైన పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నేపథ్యంలో రమేష్ మృతిని అనుమానాస్పద మృతిగా పోలీసుల కేసు నమోదు చేసుకున్నారు. ఈ క్రమంలో గొడవ జరగడంతో రమేష్ హత్యకు గురైయ్యాడా..? లేక అనారోగ్యం కారణంగా మరణించారా..? లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా..? అనే కోణాల్లో దర్యాప్తు చేప్పట్టిన పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నెంబర్, అలానే సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఈ కేసు చేధించడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా రమేష్ మృతి గురించి తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..