బీఆర్ఎస్, కాంగ్రెస్ పై బీజేపీ సెటైరికల్ ట్వీట్

చేరికల రాజకీయంపై బీజేపీ రియాక్ట్ అయింది.

Update: 2024-07-05 07:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో జరుగుతున్న ప్రజాప్రతినిధుల చేరికలపై తెలంగాణ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఒటు ఒక పార్టీకి వేస్తే సీటు మరో పార్టీకి దక్కుతోందని సెటైర్ వేసింది. పార్టీ ఫిరాయింపులతో గతంలో బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నదని దుయ్యబట్టింది. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించింది. గతంలో బీఆర్ఎస్ వలసలను ప్రోత్సహిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ అదే పని చేస్తూ ప్రజాతీర్పును ఈ రెండు పార్టీలు అపహాస్యం చేస్తున్నాయని దుయ్యబట్టింది. 6 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో 60 వైఫల్యాలు ఉన్నాయని విమర్శించింది. ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని అణలు చేయమంటే కొర్రీలు పెడుతోందని ఆరు గ్యారంటీలు అమలు కావడం లేదని, రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని విమర్శించింది. వడ్లకు బోనస్, కరెంట్ కోతలు, రాజ్యాంగానికి విరుద్ధంగా ఫిరాయింపులు, డ్రగ్స్ కు అడ్డాగా భాగ్యనగరం మారిందని ఆరోపించింది. నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెంటర్, కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్లు లేవని విమర్శించింది. మహిళలకు ఇస్తామన్న రూ.2,500 ఆర్థిక సాయం ఊసే లేదని విమర్శించింది. ఎన్నో హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం చెందిందని విమర్శించింది. 

Tags:    

Similar News