Telangana పై BJP స్పెషల్ ఫోకస్! రోడ్ మ్యాప్‌పై సమీక్ష
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరగనున్నాయి.
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 16 నుంచి రెండు రోజుల పాటు ఢిల్లీలో జరగనున్నాయి. రాష్ట్రం నుంచి బండి సంజయ్‌తో పాటు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, మురళీధర్‌రావు, ఈటల రాజేందర్ తదితరులు వెళ్లనున్నారు. ఈ మీటింగ్స్‌లో తెలంగాణకు సంబంధించి స్పెషల్ డిస్కషన్ జరగనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీకి సంస్థాగతంగా ఉన్న బలం, ఇంకా మెరుగుపడాల్సిన నియోజకవర్గాలు, అక్కడ పార్టీపరంగా తీసుకోవాల్సిన చర్యలు తదితరాలపై లోతైన చర్చ జరగనున్నది.
హై కమాండ్ దిశానిర్దేశం
రాష్ట్రంలో బీజేపీ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఆందోళనలకు ఎదురైన ఇబ్బందులు, రాజకీయ పార్టీగా బీఆర్ఎస్ నుంచి వస్తున్న చిక్కులు తదితరాలన్నింటిపై ఈ సమావేశాల సందర్భంగా తెలంగాణ నేతలతో విడిగా సమావేశం జరిగే అవకాశం ఉందని రాష్ట్ర నేతల సమాచారం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ ఇకపైన ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లడానికి ఏయే క్యాంపెయిన్‌లను చేపట్టాలనే దానిపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చతో పాటు చివరకు హైకమాండ్ నుంచి దిశా నిర్దేశం ఉంటుందని నేతల ద్వారా తెలిసింది.
పాదయాత్రలో మార్పులు!
ప్రజా సంగ్రామ పాదయాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభం కావచ్చని సూచన ప్రాయంగా రోడ్ మ్యాప్‌ను తయారుచేసినా, ఢిల్లీలోని జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశాల అనంతరం తేదీల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశమున్నట్లు పార్టీ సీనియర్ నేతల అభిప్రాయం. పరిస్థితులకు అనుగుణంగా, హై కమాండ్ సూచనలతో చివరి నిమిషంలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తన పాదయాత్రలో మార్పులు చేసే అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
Also Read...