‘రంగు రంగుల రేవంతన్న.. ఊసరవెల్లి కన్నా మిన్న’ బీజేపీ ట్వీట్ వైరల్

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి.

Update: 2024-04-25 15:29 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. ఒక్కోసారి ఆ విమర్శలు కాస్త శృతి మించి పోవడం నెటిజన్లకు తెలిసిన విషయమే. ఎడిటింగ్‌లు, పేరడీ సాంగ్‌లతో రాజకీయ నేతలను ట్రోల్స్ చేస్తున్నారు. అది కూడా అధికార పార్టీ హ్యాండిల్ నుంచే పోస్టులు చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ హ్యాండిల్స్ ఏ విధంగా విమర్శలు చేసుకున్నాయో చూశాం. లోక్‌సభ ఎన్నికల్లో వేళ అదే స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేసుకుంటూ పార్టీల మధ్య సోషల్ మీడియాలో వార్ నడుస్తోంది.

తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీ ‘రంగు రంగుల రేవంతన్న.. రంగులు మార్చడంలో ఊసరవెల్లి కన్నా మిన్న’ అని ఓ పేరడీ సాంగ్ పోస్ట్ చేసింది. ఇది పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వీడియో వైరల్‌గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీలు మారడం పై విమర్శలు చేస్తూ.. రంగోలి రేవంత్ హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది బీజేపీ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ నయ వంచన "పదేండ్ల మోసం - పదేండ్ల విధ్వంసం" అంటూ ఛార్జ్ షీట్ విడుదల చేసింది. ఇందులో ప్రధాని మోడీని విమర్శిస్తూ గాంధీ భవన్ ఎదుట ఇవాళ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో బీజేపీ పార్టీ ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రంగు రంగుల రేవంతన్న.. అని బీజేపీ పార్టీ పేరడీ సాంగ్ వీడియో ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేసింది.

Tags:    

Similar News