BREAKING: ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ గవర్నర్‌ను కలుస్తామని స్పష్టం చేశారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రైవేట్ వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్న విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రతిపక్ష నేతలతో పాటు ప్రముఖ వ్యాపారులు, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ ఓనర్లు, హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు ఎస్పీలు, ఓ రిటైర్డ్ డీసీపీ, ఓ డీఎస్పీని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో త్వరలోనే రాజకీయ పెద్ద తలకాయలు జైలుకు వెళ్తాయని స్వయంగా సీఎం, మంత్రులు వ్యాఖ్యానిస్తుండటంతో ఈ కేసుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఫోను ట్యాపింగ్ కేసులో ఎక్కువగా బీఆర్ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో త్వరలోనే వీరు జైలుకు వెళ్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.