బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవడం వింతేం కాదు: లక్ష్మణ్

పొత్తులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపి ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయనేది వింత ఏమి కాదన్నారు.

Update: 2023-02-14 09:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తులపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపి ఎంపీ లక్ష్మణ్ స్పందించారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ కలుస్తాయనేది వింత ఏమి కాదన్నారు. ఆ రెండు పార్టీలు ఎప్పటి నుంచో కలిసే పని చేస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా సెక్యులర్‌ పార్టీల పేరుతో బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, వామపక్షాలు, ఎంఐఎం పార్టీలు ఏకమవుతున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే తమ పార్టీ విధానాన్ని బలపరుస్తూ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడారని చెప్పారు. ఈ మేరకు మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఢిల్లీలో కాంగ్రెస్‌కు బీ టీంగా బీఅర్ఎస్ వ్యవహరిస్తే..రాష్ట్రంలో బీఅర్ఎస్‌కు బీ టీంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు.

లౌకికవాదం అనే బూచి చూపించినా.. ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేసి స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అది బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఇక, రేవంత్ రెడ్డి కాళ్లకు బలపం కట్టుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమేనని సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఈ రెండు పార్టీలకు ఎప్పుడో లోపాయికారీ ఒప్పందం కుదిరిందని, వారు బీజేపీపై చేసే దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీజేపీయేనని గంటాపధంగా చెప్పారు.

Tags:    

Similar News