అవినీతి ఊడలమర్రి కల్వకుంట్ల ఫ్యామిలీ: MP లక్ష్మణ్ ఫైర్

కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఊడల మర్రిలా విస్తరించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో శుక్రవారం

Update: 2023-11-24 14:26 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఊడల మర్రిలా విస్తరించిందని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపణలు చేశారు. సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై విసిగిన ప్రజలు మార్పుకోరుకుంటున్నారని, తెలంగాణ ప్రజలు బీజేపీకే ఓటేయాలని డిసైడయ్యారని పేర్కొన్నారు. ఈ చీడపీడను అంతంచేసే రోజు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. బీజేపీ మేనిఫెస్టోను అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారని వెల్లడించారు. రైతుకు ఊరటనిచ్చేలా తమ హామీలు, ప్రణాళికలు ఉన్నాయని ఆయన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, కర్నాటకలో చెల్లని కాంగ్రెస్ గ్యారెంటీలు తెలంగాణలో ఎలా చెల్లుతాయని లక్ష్మణ్ ప్రశ్నించారు.


Similar News