బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోంది: MP లక్ష్మణ్
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని బీజేపీ హెడ్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ అడుగుజాడల్లోనే కాంగ్రెస్ నడుస్తోందని విమర్శించారు. పాలన పక్కనబెట్టి సీఎం రేవంత్ రెడ్డి చేరికలపై దృష్టి పెట్టారని అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణను అంధకారంగా మార్చొద్దని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ఏనాడూ ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో కచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమవుతుందని మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని.. అదే సమయంలో ప్రభుత్వం పడిపోతుంటే తాము కాపాడలేమన్నారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు అంటున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల అన్నారు.