Etela Rajender: ఆదివారం వస్తే భయంతో బతకాల్సిన పరిస్థితి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) సవాల్ విసిరారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) సవాల్ విసిరారు. మూసీ పరివాహక ప్రాంతం(Musi catchment area)లో కనీసం వెయ్యి మంది బాధితులు ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నా ముక్కు నేలకు రాస్తానని, దీనికి ముఖ్యమంత్రి సిద్ధమా? అంటూ సవాల్ విసిరారు. రామంతపూర్‌లోని బాలకృష్ణ నగర్, సాయికృష్ణ నగర్‌లోని మూసీ పరివాక ప్రాంతంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్ రెడ్డితో కలిసి పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. ప్రజలు కేసీఆర్‌తో విసిగిపోయి.. కాంగ్రెస్‌ను గెలిపించి రేవంత్‌ను సీఎం చేశారన్నారు. కానీ గెలిపించిన పాపానికి రెండు నెలలుగా చెరువులు, మూసీ పక్కన 30, 40 ఏళ్లుగా ఉంటున్న వారికి కంటిమీద కునుకులేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోందని మండిపడ్డారు. మూసీలో కొబ్బరినీరు పారిస్తానని చెప్పిన రేవంత్.. ఇవాళ దానికి డీపీఆర్ లేదని చెబుతున్నారని మండిపడ్డారు. శని, ఆదివారం వస్తే పేదలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. నోరు విప్పితే రేవంత్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడటం లేదన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలు రేవంత్ రెడ్డి సంగతేంటో తేలుస్తామని చెబుతున్నారని ఈటల తెలిపారు.