సీఎం కేసీఆర్‌పై BJP MP అర్వింద్ సంచలన వ్యాఖ్యలు
జాతీయ ఉపాధి హామీ పథకంలో పని రోజులు 100 నుంచి 150 రోజులకు పెంచితే రూ. 200 కోట్ల ఖర్చు వస్తుందని ఆ పని చేయడం చేతకాని సీఎం కేసీఆర్..
దిశ, డైనమిక్ బ్యూరో: జాతీయ ఉపాధి హామీ పథకంలో పని రోజులు 100 నుంచి 150 రోజులకు పెంచితే రూ. 200 కోట్ల ఖర్చు వస్తుందని ఆ పని చేయడం చేతకాని సీఎం కేసీఆర్.. తన కూతురికి మాత్రం వంద కోట్లు ఇచ్చి లిక్కర్ దందా చేయాలని, కొడుకుకు వంద కోట్లు ఇచ్చి ఫీనిక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలని ఇవ్వడానికి వస్తోందా అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడీ 101 దేశాలకు 24 కోట్ల వ్యాక్సిన్లు పంపితే 24 కోట్ల దొంగ సొమ్ము విదేశాలకు పంపుతున్నాడని విమర్శించారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాస్త పరువు అయినా నిలుపుకోవాలని సలహా ఇచ్చారు. కేసీఆర్ కు ఆయన ఎంపీలకు గరీబ్ కల్యాణ్ యోజనలపై పార్లమెంట్ లో చర్చించాలని అంతే కాని అనవసరంగా ప్రధానిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. గుజరాత్ లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సిగ్గుపోయిందన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఎలాంటి ఎజెండా లేదని అది ఓ స్విగ్గి లాంటిదని ఆ పార్టీ ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండాలన్న ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ గతంలో ఆంధ్ర తమిళనాడు నుంచి విడిపోయిందని అందువల్ల ఏపీని వెళ్లి మద్రాస్ లో కలపాలని అన్నారు. సజ్జల ఎమ్మెల్యే కూడా కాదని అలాంటి వ్యక్తిని ఏపీ సీఎం జగన్ తన సలహాదారుగా పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. ముందు సజ్జలను మార్చుకోవాలని సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు మానుకుని తెలంగాణ మీద మాట్లాడవద్దని హెచ్చరించారు.