మంత్రి సబిత రాజీనామా చేయాలె.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్

పేపర్ లీకుల వ్యవహారం తెలంగాణ సర్కార్ ను వీడటం లేదు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దుమారం కొలిక్కి రాకముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో హల్ చల్ చేసింది.

Update: 2023-04-03 13:59 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పేపర్ లీకుల వ్యవహారం తెలంగాణ సర్కార్ ను వీడటం లేదు. టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం దుమారం కొలిక్కి రాకముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో హల్ చల్ చేసింది. దీంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. పరీక్ష జరుగుతుండగానే వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ పాఠశాలలో పదోతరగతి ప్రశ్నాపత్రం వాట్సాప్ లో ప్రత్యక్షం కావడంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. ఈ వ్యవహారంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.

ఈ ప్రభుత్వంలో అన్ని లీకులేనని, ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఇప్పటికే టీఎస్ పీఎస్సీతో సహా అనేక సమస్యలతో విద్యాశాఖ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటుండగా మరోసారి అదే శాఖలో ప్రశ్నాపత్రం బహిర్గతం కావడంతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాఖను వివాదాలు వీడటం లేదనే టాక్ వినిపిస్తోంది.

Tags:    

Similar News