మూసీ బాధితులతో బీజేపీ మహాధర్నా ప్లాన్ ఇదే.. ఆ ప్రాంతాల్లో 9 బృందాల పర్యటన

హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది.

Update: 2024-10-21 13:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఇళ్ల కూల్చివేతలపై బాధితులతో కలిసి మహా ధర్నాకు బీజేపీ ప్లాన్ చేసింది. ఈ నెల 25న ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అధ్యక్షతన బాధితులతో మహాధర్నా ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 23 , 24 తేదీల్లో మూసీ బాధిత పరివాహక ప్రాంతాల్లో వారు పర్యటించనున్నారు. ఇందులో భాగంగా బీజేపీ 9 బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు పర్యటనలో బాధితులకు భరోసా కల్పించనున్నారు. ఈ విషయాలను బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు సోమవారం పార్టీ స్టేట్ ఆఫీస్‌లో మీడియాకు వెల్లడించారు.

18 ప్లేస్‌లలో ఎంపీ, ఎమెల్యేల బృందాలు మూసీ పరివాహక ప్రాంతాను విజిట్ చేస్తాయని ప్రకటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలను ఇబ్బంది పెడితే బీజేపీ ఊరుకోదని పోరాడుతుందని ఆయన అన్నారు. అలాగే మూసి చరిత్ర నీకు తెలుసా? ముస్కుందా మహర్షి పేరు మీద మూసీ పేరు వచ్చిందని వివరించారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, మూసి మీద రేవంత్ పూటకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. డీపీఆర్ ఇవ్వకుండా అఖిలపక్షం మీటింగ్ ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిది బాలక్ బుద్ధి అని, మూసీలో అంబాడుతున్నట్టు ఉందని తీవ్ర విమర్శలు చేశారు. మూసీ ప్రాంత ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సుందరీకరణ చేస్తే తాము మద్దతు ఇస్తామని, మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ కట్టు అని వెంకటేశ్వర్లు సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.


Similar News