బ్రేకింగ్.. పాతబస్తిలో మాధవి లత నిరసన
పోలింగ్ ముగిసిన తర్వాత మాధవీ లత నిరసనకు దిగారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉన్న 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఈ రోజు(మే 13)న పోలింగ్ జరిగింది. కాగా రాష్ట్రంలో ఉన్న 16 నియోజకవర్గాలు ఒక ఎత్తు అయితే రాష్ట్ర రాజధానిలోని ఓల్డ్ సీటి ఎన్నికల ఫైటింగ్ మరో ఎత్తు అన్నట్లు వాతావరణం ఏర్పడింది. గత 40 సంవత్సరాలుగా నామమాత్రపు ఎన్నికగనే హైదరాబాద్ లో ఎన్నికలు జరుగుతుంటాయి. కానీ ఈ సారి బీజేపీ ఆ నియోజకవర్గం నుంచి మాధవీ లతను అభ్యర్థిగా ప్రకటించడంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. సామాజీక వెత్తగా పేరుగాంచిన ఆమె.. హైదరాబాద్ ఎంపీ సీటును గెలిచేందుకు తీవ్రంగా కృషి చేశారు. ఇదిలా ఉంటే.. పోలింగ్ ముగిసిన తర్వాత మాధవీ లత నిరసనకు దిగారు. సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జమాల్ కాలనీ, రియాసత్ నగర్‌లోని పోలింగ్ బూత్‌లో కొందరు వ్యక్తులు ఎన్నికల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు. దీంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.