హిందు ధర్మం జోలికొస్తే ఎవరికైనా.. ఏ పార్టీకైనా.. ఇదే గతి: చికోటి ప్రవీణ్

రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఎద్దేవాచేశారు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ

Update: 2024-07-05 16:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయిందని బీజేపీ నేత చికోటి ప్రవీణ్ ఎద్దేవాచేశారు. ఇప్పటికే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారారని, త్వరలో మాజీ మంత్రులు కూడా పార్టీ మారుతారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన పేర్కొన్నారు. హిందు ధర్మం, గోమాతపై దాడి చేస్తే ఏ పార్టీ అయినా, ఎవరైనా ఇదే గతి పడుతుందని చికోటి హెచ్చరించారు. ఇలా చేసిన పార్టీకి, నాయకులకు క్షణికానందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో అవ్వడం ఖాయమన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఔట్ అయిందని ఆయన పేర్కొన్నారు. ఆఖరికి ఎంఐఎంలో విలీనమయ్యే దుస్థితి గులాబీ పార్టీకి ఏర్పడిందని సెటైర్లు వేశారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏంటో చూద్దామని, వాళ్లు కూడా బీఆర్ఎస్ నేతల్లాగే వ్యవహరిస్తే.. వాళ్ల బతుకు కూడా బస్టాండ్ అవ్వడం ఖాయమని చికోటి ప్రవీణ్ హెచ్చరించారు.


Similar News