ఫ్యామిలీ టైం! మేనల్లుడితో చిల్ అవుతున్న బండి సంజయ్! ఎక్స్‌లో ఆసక్తికర పోస్ట్..
దాదాపు రెండు నెలల ప్రచారంలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
దిశ, డైనమిక్ బ్యూరో: దాదాపు రెండు నెలల ప్రచారంలో తలమునకలైన ప్రధాన పార్టీల అభ్యర్థులు, లీడర్లు రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోయారు. పోలింగ్ ముగిసిపోవడంతో రెండు, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలని, విహార యాత్రలకు వెళ్ళాలని నాయకులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. మరోవైపు కుటుంబ సభ్యులకు తగిన సమయాన్ని కేటాయించడం పైన నేతలు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మేనల్లుడితో చిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా ఫోటోలు పంచుకున్నారు.
మారథాన్ లాంటి ప్రచారం తర్వాత ఫ్యామిలీ టైమ్ అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు. మేనల్లుడిని పట్టణంలో స్కూటీపై సరదాగా తిప్పారు. తర్వాత ఐక్రీం షాప్‌లో మేనల్లుడితో కలిసి ఐక్రీం తింటున్న ఫోటోలు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు.
Some family time after a marathon campaign
Posted by Bandi Sanjay Kumar on Tuesday 14 May 2024