Maheshwar Reddy: రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ

రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-06 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నాంపల్లిలోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బీసీ డిక్లరేషన్(BC Declaration) ద్వారా ప్రజలకు ఇచ్చిన 21 అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన విషయంలో కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్(BRS) హయాంలో సమగ్ర కుల సర్వే నిర్వహించిన కేసీఆర్(KCR).. ఆ వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. కులగణన ద్వారా బీసీలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని అడిగారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పది మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు బీసీలకు మాత్రమే అవకాశం ఇచ్చారని అన్నారు. మంత్రి వర్గంలో 42 శాతం బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లతో 31 మంది మైనార్టీలు గెలిచారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం చేతిలో ఉన్న మైనార్టీ రిజర్వేషన్లు(Minority reservations) ఎత్తివేయకుండా బీసీలను కుల గణన పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కులగణనతో బీసీలకు ఎలాంటి లబ్ధి జరుగుతోందో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

‘అసలు రాహుల్ గాంధీది ఏ కులమో, ఏ మతమో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ తాత పేరు ఫిరోజ్ జహంగీర్ గాంధీ. రాహుల్ హిందువో.. ముస్లీమో చెప్పాలి. ఫిరోజ్ జహంగీర్ గాంధీ మనవడు రాహుల్ జహంగీర్ గాంధీ కావాలి కదా’ అని అన్నారు. రాజకీయాల్లో ఉన్న రాహుల్ తన కులం, మతం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ - ఈ రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..