ఇది వివక్ష కాదు.. ఖచ్చితంగా కక్ష! కాంగ్రెస్‌పై బీజేపీ తీవ్ర ఆరోపణలు

ఇది వివక్ష కాదు.. ఖచ్చితంగా కక్ష.. అని కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శించింది.

Update: 2024-02-23 12:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇది వివక్ష కాదు.. ఖచ్చితంగా కక్ష.. అని కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ బీజేపీ పార్టీ సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విమర్శించింది. వక్ఫ్ భూముల రక్షణ కోసం 200 కోట్లు, తబ్లిగీ జమాత్ సభకు 4 కోట్లు "చేయూత" ద్వారా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని తెలిపారు. మేడారం జాతర కోసం విచ్చేసే భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడానికి "చేయి" ఎందుకు రావట్లేదు? అని విమర్శించింది.

ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర.. మన దేశంలో కుంభ మేళా తర్వాత అత్యంత భారీ భక్త జనాల్ని ఆకర్షించే పండగ మన సమ్మక్క సారలమ్మ మేడారం జాతర అని పేర్కొంది. కానీ.. మేడారం జాతరకు విచ్చేసే భక్తులకు సరైన బస్సు, నివాస సదుపాయాలు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించలేదని ఆరోపించింది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..