మునుగోడుపై స్పీడ్ పెంచిన బీజేపీ.. ఉప ఎన్నిక ఇన్‌చార్జిగా కీలక నేత

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది.. నాలుగో 'ఆర్'ను శాసన సభకు పంపించాలని తహతహలాడుతోంది.

Update: 2022-09-01 04:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొంది.. నాలుగో 'ఆర్'ను శాసన సభకు పంపించాలని తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే టీ-బీజేపీ నేతలు మునుగోడుపై ఫోకస్ పెంచారు. ఈ ఉప ఎన్నికకు ఇన్‌చార్జిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేగాక, పార్టీ శ్రేణులు, అభ్యర్థి సమన్వయకర్తగా నియోజకవర్గ కీలక నేత గంగిడి మనోహర్ రెడ్డిని నియమించారు. ఈ నెల 5,6,7 తేదీల్లో మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు పర్యటించనున్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా నియోజకవర్గంలో మరో భారీ బహిరంగ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

Also Read : కేసీఆర్‌ను కలుస్తా.. కొట్లాటొద్దని చెప్తా: కోమటిరెడ్డి 

Tags:    

Similar News