Munugode bypoll :టీఆర్ఎస్‌పై నేడు ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధికార టీఆర్ఎస్‌పై ముప్పేట దాడికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్
దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ అధికార టీఆర్ఎస్‌పై ముప్పేట దాడికి సిద్ధమైంది. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలను టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తుంటే తాజాగా టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేస్తోందంటూ ఈసీకి ఫిర్యాదు చేయబోతున్నది. మునుగోడు ఉప ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని గురువారం రాష్ట్ర బీజేపీ నేతలు కలవబోతున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి మురళీధరన్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు ఈసీని కలవనున్నట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సజావుగా సాగాలంటే సెంట్రల్ ఫోర్స్‌ను దించడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తోంది. మునుగోడులో నమోదైన ఓటర్ల లిస్ట్‌పై బీజేపీ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ విషయంలో బీజేపీ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది. ఫామ్ 6 కింద అప్లై చేసుకున్న వారిలో ఫాల్స్ ఓటర్లు ఉన్నారని బీజేపీ తెలిపింది. తక్కువ సమయంలో వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అధికార బలంతో మునుగోడులో గెలిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుందని అందువల్ల చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు కోరే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
1. మునుగోడులో కమ్యూనిస్టు క్యాడర్ అలక.. ఓట్లకు గండి పడే అవకాశం?