‘బిర్యానీ బీర్’ తాగితే తిన్నట్లేనా..? తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్స్ ఎంట్రీ?

తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త బ్రాండ్‌ బీర్లు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో ‘బిర్యానీ’ పేరుతో కొత్త బ్రాండ్ ప్రవేశపెడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వాటిలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Update: 2024-06-09 08:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎంట్రీ ఇవ్వనున్న కొత్త బ్రాండ్‌ బీర్లు సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటిలో ‘బిర్యానీ’ పేరుతో కొత్త బ్రాండ్ ప్రవేశపెడుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయతే, రాష్ట్రంలో తాజాగా బీర్ల కొరత ఏర్పడింది. ఈ కొరత కారణంగానే కొత్త కంపెనీలకు అనుమతిచ్చామని ప్రభుత్వం పేర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఇటీవల పలు కొత్త బీర్ల కంపెనీలకు రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్ అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇందులో సోమ్ డిస్టిలరీస్, మౌంట్ ఎవరెస్ట్ లాంటి 5 కంపెనీలు కలిసి తెలంగాణలో 26 రకాల కొత్త బీర్లు మార్కెట్లోకి తేనున్నట్లు తెలిసింది. ఇందులో దబాంగ్, హంటర్, లేమౌంట్ బీర్ల లాంటి కొత్త బ్రాండ్స్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణలోకి ‘బిర్యానీ బీర్’ అందుబాటులోకి రాబోతుందని తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బిర్యానీ బీర్ తాగితే.. బిర్యానీ తిన్నట్లేనా? నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News