Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బిగ్ ట్విస్ట్! పోలీస్ స్టేషన్ మారింది
తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది.
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు విచారణ జరుగుతున్న పోలీస్ స్టేషన్ పరిధి మారింది. బంజారాహిల్స్ నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. ఈ కేసులో నిందితుడు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు నుంచి కీలక సమాచారాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోనే రాబట్టారు. అయితే ఈ మార్పునకు గల కారణాలపై స్పష్టత మాత్రం అధికారులు తెలుపలేదు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు మమ్మరంగా సాగుతోంది. దర్యాప్తు అధికారులు కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మరిన్ని అరెస్టులు కూడా చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కొంత మంది పోలీసు అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.