రఘునందన్ రావుకు BIG షాక్.. అధిష్టానానికి సొంత నేతల లేఖ

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మొత్తం 17 స్థానాలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి.

Update: 2023-12-21 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలన్నీ లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు మొత్తం 17 స్థానాలపై ఫుల్ ఫోకస్ పెట్టాయి. అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బ తిన్నా.. లోక్‌సభలో సత్తా చాటాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఫలితాలు సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిక్స్ అయ్యారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన బీజేపీ కీలక నేతలు కూడా లోక్‌సభలో నెగ్గి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. దీంతో రాష్ట్రంలో త్రిముఖ పోరు నెలకొనే అవకాశం ఉంది.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్రనేతలు ఓటమి చెందిన విషయం తెలిసిందే. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు వంటి కీలక నేతలు ఓటమి పాలయ్యారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి తప్పిదం జరగకుండా ముందస్తుగానే కసరత్తులు ప్రారంభించారు. ఎలాగైనా టికెట్ సాధించి.. గెలిచి తామేంటో చూపించాలని తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో మెదక్ లోక్‌సభ స్థానంపై అనేకమంది బీజేపీ లీడర్లు కన్నేశారు. అంతేకాదు.. ఢిల్లీకి వెళ్లి మరీ పైరవీలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో మెదక్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే రఘునందర్ రావుకు టికెట్ ఇవ్వొద్దని హైకమాండ్‌కు సొంత నేతలు వినతులు సమర్పిస్తున్నట్లు సమాచారం. అధిష్టానాన్ని విమర్శించిన వారికి టికెట్లు ఇవ్వొద్దని హెచ్చరికలు సైతం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి వచ్చే ఎన్నికల్లో రఘునందన్ రావుకు అధిష్టానం టికెట్ ఇస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..